Atlanta Ugadi & Srirama navami (2016-04-23)
Atlanta Ugadi & Srirama navami (2016-04-23)
April 23, 2016 No Comments @apta
When:
April 23, 2016 @ 8:30 am – 2:30 pm Atlantic/Azores Timezone
2016-04-23T08:30:00+00:00
2016-04-23T14:30:00+00:00
Cost:
Free
Atlanta Ugadi & Srirama navami (2016-04-23)

ఆప్తులందరికీ ప్రత్యెక ధన్యవాదాలు!!

ఆప్త అట్లాంటా ఆప్తబంధువుల ఉగాది, శ్రీరామనవమి సందడి – ముచ్చట్లు – హృదయ పూర్వక కృతజ్ఞత పత్రము

ఆప్త అట్లాంటా ఆప్తబంధువుల ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకల విశేషాలు సరదాగా ముచ్చటించుకొందాం..

పూర్వం మన పల్లెటూర్లలో సీతారాముల కళ్యాణ వేడుక జరిగితే మనం బందుమిత్రసపరివారంతో ఎలా సందడి చేస్తామో, అలాగే సంప్రదాయబద్దమైన మన తెలుగు దుస్తులు, అచ్చతెలుగు సంభాషణలు, చిన్న,పెద్ద తేడా లేకుండా, కలసికట్టుగా, అన్నింటినీ సమతుల్యంగా పంచుకొని, ఆనంద డోళికల్లో చూడ్డానికి రెండుకళ్ళూ సరిపోని రీతిలో భేషుగ్గా ఓ పెద్ద కుటుంబంలా సందడి చేసాము. మా అట్లాంటా ఆప్త ఆహ్వానాన్ని మన్నించి మాతో మీ విలువైన సమయాన్ని, ఆనందాన్ని, సంతోషాలని పంచుకొన్న ప్రతి ఒక్క ఆప్తులకీ పేరు పేరున శతకోటి నమస్సుమాంజలి. కనీసం ఫోటోకి కూడా రాకుండా కేవలం పనిలో, వడ్డనలో, హుషారుగా పాలుపంచుకున్న,కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ప్రత్యెక గౌరవ కృతఙ్ఞతలు మరియు అభినందనలు. 

ఆప్త అట్లాంటా వేదిక నిర్వహణ, అలంకరణ బృందాలు నరేష్ శ్రీరామ, సూర్య బుడిమ్, దేవానంద్ కొండూరు, సురేష్ ధూళిపూడి, రాజేష్ యల్లబండి,అప్పారావు గోపు, లక్ష్మినారాయణ గద్దె, విజయ్ & హిమబిందు నరహరిశెట్టి,నారాయణ కందుల, రామకృష్ణ వేల్పూరి,సాంబ బేతంచెర్ల, రవి కల్లి, శ్రీనివాస్ మిరియాల, పునీత్ చందు & ఇన్నయ్య యనుమల గార్లు ఉదయం నుండి రాత్రి 2 గంటల సమయం వరకు అన్నీ తామే అన్నట్లు అందరిలో ఒకరిలా కలసి వ్యవహరించారు.

దాదాపుగా 70 నుండి 75 కుటుంబాల అపురూప కలయిక .. పచ్చటి  విరబూసిన ఆప్త వనం, అత్బుత ఆనంద పారవశ్య, ఆహ్లాదకరమైన కోలాహలం గురించి ఎంతచెప్పినా తక్కువే, ఎంతసేపయినా కబుర్లాడుకోవచ్చు. వాహ్ –అనిపించేలా!   12 మందితో ఓ మెగాగ్యాంగ్ అనుకొంటే, 25 మంది ఆప్తులు మేమున్నాం అంటూ ముందుకొచ్చారు, చివరకు చూసుకొంటే 300 మందితో చిన్నలు, పెద్దలు, అంతా కలసికట్టుగా ఓ అద్భుతమైన జనసేన తయారయ్యింది.v  ఆప్త ఆడపడుచులు మహిళలు హిమబిందు నరహరిశెట్టి, శైలజ మీసాల, దాక్షాయణి శ్రీరామ, నీలిమ బుడిమ్, భవ్య బీగాల గార్లు విఘ్న వినాయకుడు,సీతాశ్రీరాముల పూజ కార్యక్రమాలు నిర్వహించారు.  

v  ఆప్తఅట్లాంటా ఆతిథ్యనిర్వహణ బృందం నరేష్ శ్రీరామ ఆధ్వర్యంలో లలిత గోపు,నారాయణ కందుల,సాంబ బేతంచెర్ల, అను కేశనశెట్టి, ఇన్నయ్య యనుమల గార్లు , తదితర ఆప్తులు సభికులను గౌరవ మర్యాదలతో స్వాగతించారు.

v  అను కేసనశెట్టి గారు విఘ్నేశ్వరుడి ప్రార్థనతో సభను ప్రారంభించారు.

v  చిన్నారులు ఆద్య మరియు లీల సౌజన్య తమ కీర్తనలతో సభికులను ఆకట్టుకొన్నారు.

v  ఆప్త చిన్నారి మనస్వి శ్రీరామ కూచిపూడి నాట్య౦ – శ్రీహరి స్త్రోత్రం చక్కటి అభినయ ప్రదర్శనతో ఆప్తులని ముగ్దులని చేసి అందరి ప్రశంసలు అందుకొంది.

v  ఆప్త అట్లాంటా సాంస్కృతిక బృందం సురేష్ కరోతు & దేవానంద్ కొండూరు గార్ల ఆధ్వర్యంలో వందన పసుపులేటి, హిమబిందు నరహరిశెట్టి, నీలిమ బుడిమ్, హిమబిందు చింతలపూడి గార్లు తమ సుమధుర వ్యాఖ్యానాలతో, చక్కటి చలోక్తులతో సభను ఆద్యంతం అలా కట్టిపడేశారు. శ్రీవల్లి కొండూరు & దీప వల్లె గార్లు తమ సంగీతంతో సభను ఆకట్టుకొన్నారు.

v  సురేష్ కరోతు గారు కార్యక్రమంలో ప్రధమ ఘట్టంగా రీజనల్ వైస్ ప్రెసిడెంట్  నరేష్ బాబు శ్రీరామ ను ఆహ్వానించి సభకు పరిచయం చేసారు.  

v  నరేష్ బాబు శ్రీరామ ప్రసంగిస్తూ ఆప్త (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) గురించి,ఇండియా, అమెరికాదేశాల్లో  ఆప్త దిగ్విజయంగా నిర్వహిస్తోన్న కార్యక్రమాల గురించి 4 మంచిమాటలు మాట్లాడి, భవిష్యత్తులో APTA చేయబోయే కార్యక్రమాల గురించి వివరిస్తూ, తమ కార్యవర్గ సహచరులను సభకు పరిచయం చేశారు. 

v  రాజేష్ యళ్ళబండి – బోర్డు సెక్రటరీ; దేవానంద్ కొండూరు –  న్యూస్లెటర్స్ & కమ్యూనికేషన్స్;  సురేష్ ధూళిపూడి-జాయింట్ కోశాధికారి; సురేష్ కరోతు – C&E వైస్ చైర్; సూర్య బుడిమ్- రీజినల్ ASEPడైరెక్టర్, హిమబిందు – స్టేట్ కోఆర్డినేటర్; వందన పసుపులేటి – రీజినల్- C&E చైర్; దీప్తి నాయుడు – రీజినల్ విమెన్ డైరెక్టర్ ; నాగపునీత్ చందు – స్టేట్ మెంబెర్షిప్ డైరెక్టర్ .

v  ఆప్త కార్యవర్గ సభ్యులందరూ తమ, తమ ప్రసంగాలతో సభికులను ఆకట్టుకొని సభకు మరింత శోభను తీసుకొచ్చారు. 

తదుపరి కార్యక్రమాలు మరింత ఉర్రూతలూగిస్తూ ఈ విధంగా సాగాయి.

Ø  4 – 6 సంవత్సరాల చిన్నారిపిల్లలు తమ చూడముచ్చటయిన నాట్యవిన్యాసాలతో అందరినీ అలరించారు, ఆధ్య కలవ జత కలవడం అద్బుత దృశ్యం.పాల్గొన్న చిన్నారులు: (హనిష చింతలపూడి , కృష్ణసాయి బుడిమ్,వేద బకుర, శ్రీహనుమ బేతంచెర్ల, శ్రీరామ గిరిడ, సుహాస్, కార్తీక్, రోహన్ పుప్పాల, శ్రీహనుమ బేతంచెర్ల, మనిసేందన్ కందుల)

Ø  ఈ కార్యక్రమంలో పాల్గొన్న 7 – 9 సంవత్సరాల చిన్నారి అమ్మాయిలు –  మనస్వినాయుడు శ్రీరామ, సిరిచందన కల్లి, లీల సౌజన్య బేతంచెర్ల, చాతుర్య మిరియాల, తనిష్క రాజ్ రెడ్డి, లోహిష చింతలపూడి, ఆశ్రిత బొబ్బిలి,నిషిత మేడ, ఆద్య రామిశెట్టి & సాత్విక. 7 – 9 సంవత్సరాల చిన్నారి అబ్బాయిలు – సుజిత్ ఎనుమల & సహిష్ణు వేల్పూరి – సినిమా చూపిస్తా మామా, అంటూ తమ నృత్యాలతో అదరగొట్టి సభికులకు వినోదాన్ని అందించారు.

Ø  అందరి పిల్లలకు చక్కటి తర్ఫీదును అందించిన హిమబిందు చింతలపూడి, దీప వల్లె గార్లు ప్రత్యేక  అభినందనీయులు.

Ø  తదుపరి కార్యక్రమం APTA – ASEP .  సూర్య బుడిమ్ గారు ఆప్త స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం గురించి చక్కగా సభికులకు వివరించారు.  సహచరులు సురేష్ ధూళిపూడి, దేవానంద్ కొండూరు, నరెష్ శ్రీరామ, నీలిమ బుడిమ్, జనార్ధన్ పన్నెల, విజయ్ & హిమబిందు నరహరిశెట్టి, సాగర్&వనజ లగిశెట్టి గార్లు ఈ కార్యక్రమం వలన ఇండియాలో ఉన్న మన ఆప్తులు, పేద విద్యార్థులు ఎలా లబ్ధి పొందగాలరో చక్కగా వివరించారు.  తమ, తమ విరాళాలు ప్రకటించారు.

Ø  ఆప్త చిన్నారులు శ్రీరామ్ బుడిమ్, సాయి వేల్పురి, అక్షద లగిశెట్టి, గౌరవ్ గోపు, శివాణి నరహరిశెట్టి, సంజన గోపు, ప్రేమ్ రాజ్ ఓ స్టాల్ నెలకొల్పి ASEP గురించి సభికులకు సవివరంగా తెలియచేయడానికి ప్రయత్నించారు.

Ø  జనార్ధన్ పన్నెల గారు ASEP గురించి ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించి, ఆలపించి సభను ఆకట్టుకొన్నారు. Houston నుండి సహాయం అందించిన వీర కంబాల గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

Ø  నీలిమ బుడిమ్ గారి సహకారంతో అను కేశనశెట్టి గారు, ఆప్త చిన్నారులతో కలసి వేదిక కలియతిరుగుతూ రాఫ్ఫెల్ టికెట్స్ అందరికీ అందించే భాద్యతలు స్వీకరించి, తద్వార వచ్చిన మొత్తాన్ని ASEP కి అందచేశారు. 

Ø  చిన్నారి అక్షద లగిశెట్టి ఆప్త అట్లాంటా క్రీడలు జరుగుతున్న సమయంలో, క్రీడాస్థలంలో నిమ్మకాయరసం అప్తులందరికీ పంచి, తద్వార వచ్చిన మొత్తాన్ని ASEP కి అందచేసి తన దాతృత్వం చాటుకొంది.

Ø  ఆప్త అట్లాంటా గానకోకిల శ్రీవల్లి కొండూరు గారు ఎప్పటిలాగే తన సంగీతంతో సభను ఉర్రుతలూగించారు. వారి పిల్లలు రశ్మి, శ్రియ తమ సంగీత, ’ డోళారే’ అంటూ తమ నృత్యాలతో వారి అమ్మగారికి తీసిపోని విధంగా ఆప్తులoదరినీ ఆకట్టుకున్నారు.

Ø  రామకృష్ణ వేల్పూరి, ఉమ మెరుగ గార్లు APTA NEXT-GEN కార్యక్రమం గురించి వివరించడమే కాక, పిల్లలకు ఏ విధంగా వివిధ స్థాయిలో ఉపయోగ పడుతాయో చక్కగా విశదీకరించి సభను ఆకట్టుకొన్నారు. ఈ సందర్బంగా మన చికాగో కిరణ్ పల్ల గారు ప్రత్యెక అభినందనీయులు.

Ø  ఉమ మెరుగ, రామకృష్ణ వేల్పూరి గార్లు, చిరంజీవి షణ్ముఖ సహాయంతో చదరంగం పోటీలు నిర్వహించారు, దివ్య & కళ్యాణ్ కలవ గార్లు, మల్లిక & ప్రశాంత్ రెడ్డి గార్లు కారోమ్స్ పోటీలు నిర్వహించి పిల్లల్లో మంచి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపారు.

Ø  మన సెలబ్రిటీ కౌశల్ మంద గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు, తన ప్రసంగంతో సభకు ఉత్సాహాన్ని,ఉత్తేజాన్ని నింపా రు. 

Ø  ఆప్త చిన్నారులు శివాణి నరహరిశెట్టి, అక్షద లగిశెట్టి, సంజన గోపు, అమృత ధూళిపూడి బృందం తమ నృత్యాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఈ అమ్మాయిలకు శిక్షణ ఇచ్చిన హిమబిందు చింతలపూడి, దీప వల్లె గార్లు ప్రత్యెక అభినందనీయులు.

Ø  ఆప్త లిటిల్ హీరోస్ శ్రీవంత్ కలవ, పునీత్ శ్రీరామ, నాగ్ మీసాల, తరుణ్ నరహరిశెట్టి & సిద్దార్థ్ ధూళిపూడి – సర్దార్ గబ్బర్ సింగ్ ‘ జో DAR గయా – సంజూ మర్గయ’ అంటూ తమ నృత్యాలతో అదరగొట్టి సభికులకు వినోదాన్ని అందించారు. శిక్షణ ఇచ్చిన హిమబిందు చింతలపూడి, దీప వల్లె గార్లు ప్రత్యేక అభినందనీయులు.

Ø  మౌనంగా వుండే మన వెంకట్ మీసాల గారబ్బాయి, ఆప్త చిన్నోడు, కోర మీసాల కుర్రాడు శ్రీకర్ మీసాల అత్బుతనృత్య ప్రదర్శనతో కొణిదెల రామచరణ్ తేజ్ ని గుర్తుకు తెప్పించడమే కాక, అందరి మనసులలో ప్రత్యేకస్థానం సంపాదించాడు.

Ø  ఆప్త పిల్లలందరూ తమ ప్రతిభ తగిన గుర్తింపు ట్రోఫీస్, మెడల్స్, సర్టిఫికెట్స్ ద్వారా ఆప్త అట్లాంటా సభ్యుల చేతుల మీదుగా పారితోషికం రూపేణా పొందారు, పిల్లల ఆనందానికి అవధుల్లేవు.

Ø  ట్రోఫీస్, మెడల్స్, సర్టిఫికెట్స్ విషయంలో సహకరించిన దేవానంద్ కొండూరు, నరెష్ శ్రీరామ, వెంకట్ మీసాల, సురేష్ ధూళిపూడి, రామకృష్ణ  వేల్పురి, రామి రెడ్డి గార్లకు ప్రత్యెక ధన్యవాదాలు.

Ø  ఆప్త అట్లాంటా నిధుల సేకరణ, సభ్యత్వ నిర్వహణ, ఆహార సదుపాయాల నిర్వహణ బృందాలు, మొదట్లో చెప్పిన విధంగా 100 మంది పైగా ఆప్త అట్లాంటా సిన్సియర్ సోల్జర్స్ కలసిమెలసి సహపంక్తి బంతి భోజనాలు చక్కగా నిర్వహించారు.

Ø  ఫోటోగ్రఫీ భాద్యతలు నాగ పునీత్ చందు, నారాయణ కందుల, రవి కల్లి తమ భుజాన వేసుకొని చక్కగా నిర్వహించారు.

Ø  ఆప్త అట్లాంటా సభ్యత్వ నిర్వహణ బృందం నాగపునీత్ చందు ఆధ్వర్యంలో, ఆప్త సహచరుల రాజేష్ యల్లబండి, వెంకట్ మీసాల,దీప్తి నాయుడు తదితర ఆప్తుల సహకారంతో ఓ రిజిస్ట్రేషన్ స్టాల్ నెలకొల్పి APTA సభ్యత్వ నమోదు వివరాలు సభికులకు సవివరంగా తెలియచేశారు.

Ø  ఆప్త అట్లాంటా నిధుల సేకరణ బృందం సూర్య బుడిమ్ గారి ఆధ్వర్యంలో, సాగర్ లగిశెట్టి, శ్రీనివాస్ రాయపురెడ్డి, విజయ్ నరహరిశెట్టి, రామకృష్ణ వేల్పూరి, నరేష్ శ్రీరామ, రాజేష్ యల్లబండి, సురేష్ ధూళిపూడి గార్ల సహకారంతో నిధుల సేకరణ, నిధులను క్రమశిక్షణతో సమతుల్యంగా వినియోగించడం జరుగుతుంది.

Ø  ఆహార సదుపాయాల నిర్వహణ బృందం సురేష్ ధూళిపూడి గారి ఆధ్వర్యంలో, ప్రశాంత్ కృష్ణ రెడ్డి, స్వాతి యనుముల, శ్రీనివాస్ మిరియాల, నరేష్ శ్రీరామ, నీలిమ బుడిమ్ ,లక్ష్మి నారాయణ గద్దె– GLEN, వెంకట్ మీసాల ,శైలజ మీసాల, రవి పుప్పాల, కళ్యాణ్ కలవ,  సౌoదర్య రాయపురెడ్డి, వేద ధూళిపూడి, హిమబిందు నరహరిశెట్టి, మహేశ్వర్, రమణ నీలం, వెంకట్ బొల్లిముంత,సందీప్ బీగాల, రవి కల్లి, ఇన్నయ్య యెనుముల, సాగర్ లగిశెట్టి,అప్పారావు గోపు, రామప్రకాష్ గూడూరి,శశి కేలం,సాంబ బేతంచెర్ల,క్రాంతి వల్లె, రాజేష్ ఎల్లబండి, జనార్ధన్ పన్నెల,చంద్ర పోలకు,రాజ్ పోరుమల్ల,మాధవ్ ఏపూరి,పద్మ కొండమూరి గార్ల సలహా, సంప్రదింపు,సహకారాలతో సభికులకు మంచి రుచికరమైన, తేట తెలుగు భోజనాలు, సహపంక్తి – బంతిభోజనాలు ఏర్పాటు, పైన పేర్కొన్నట్లు మెరికల్లాంటి ఆప్తుల జనసేన అత్భుత కలయిక, చేయూతలతో బహుచక్కటి విందు ఏర్పాటు చేయడం జరిగింది. అప్తులందరూ కడుపారా, సంతృప్తికరమైన భోజనం చేశారు.

Ø  ప్రత్యేకంగా ఆంధ్ర బొబ్బట్లు చేయించిన నీలిమ బుడిమ్, శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు, పానకం అమర్చిన దాక్షాయణి శ్రీరామ , ఉగాది సందర్భంగా ఉగాదిపచ్చడి అమర్చిన ఉమ మెరుగ , ప్రత్యేకంగా తయారుచేసిన మామిడికాయ పచ్చడి అమర్చిన స్వాతి యనుముల, వంటసామగ్రి, వంటపాత్రలు అమర్చి, వాటి శుభ్రత భాద్యతలు స్వీకరించిన శైలజ మీసాల, వీటన్నిటికీ నాంది అయిన వేద ధూళిపూడి గార్లకు  ప్రత్యెక ప్రసంశలతో కూడిన కృతజ్ఞతలు.

Ø  ఆప్త అట్లాంటా మూలస్తంభాలలో  ఒకరైన వేద ధూళిపూడి గారు ఈ కార్యక్రమానికి ౩ రోజులు ముందు వరకు తన భాద్యతలు చక్కగా నిర్వహించారు, తన సోదరికి ఆరోగ్య సమస్యల కారణంగా తను ఇండియా వెళ్ళవలసి వచ్చింది, మొదట్లో కొద్దిగా ఒత్తిడికి లోనయినప్పటికీ, వెంటనే కోలుకొని ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకు సాగాము. వేద గారు మంచి వ్యాఖ్యాత & అడ్మినిస్ట్రేటర్. ఆ భగవంతుడి దయవల్ల తన సోదరి క్షేమంగా వున్నారు.  వేద గారికి ప్రత్యెక ధన్యవాదాలు.  తమ భాద్యతలు చక్కగా నిర్వహించిన వందన పసుపులేటి, నీలిమ బుడిమ్,హిమబిందు నరహరిశెట్టి, శ్రీవల్లి కొండూరు, హిమబిందు చింతలపూడి గార్లకు ప్రత్యెక ప్రసంశలతో కూడిన ధన్యవాదాలు

Ø  మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసి, జయప్రదం చేసిన సాయి మందిరం గీత , రంగారావు గార్లకి,  DR. వెంకట్ సంజీవ్ గారికి, ఈవెంట్ స్పాన్సర్స్ MAGNUM OPUS సాగర్ లగిశెట్టి గారికి,  తమ ప్రెసిడెంట్ వెంకట్ మీసాల గారికి, టాలీవుడ్ నుండి విచ్చేసిన ప్రత్యేక అతిధి కౌశల్ మంద గారికి, సహకరించిన ఇతర పెద్దలకు, పిల్లలకు, అందరికీ పేరుపేరున హృదయ పూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరిపేర్లు క్రింద పొందుపరుస్తున్నాము ఏవైనా పేర్లు మరచిపోయినా, వ్యాకరణ లోపాలు ఏవైనా ఈ   థాంక్యూ నోట్ లో వుంటే మనస్పూర్తిగా క్షమించవలసినదిగా  ప్రార్థన…!!

Very Very Special THANKS to ALL the following Dedicated & Sincere APTA Families!!

Venkat & Sailaja Meesala, Vijay & HimaBindu Naraharishetty, Neelima & Surya Budim, Devanand & Srivalli Konduru, Dakshayani & Naresh Sreerama, Vanaja & Sagar Lagishetty, Soundarya Rapapureddy, Padma & Sudheer Kondamuri, Sundeep & Bhavya Beegala, Veda & Suresh Dhulipudi, Suresh & Chinni Karothu, Sunitha & Rama Krishna Velpuri, Mr & Mrs. Narayana Kandula, Swathi & Innaiah Yenumula, Rajesh Yallabandi, Ramana Neelam, Raj Porumalla, Venkat Bollimunta, Gadde Lakshmi Narayana, Anil Bakura, Bhulakshmi & Samba Bethamchela, Mallika & Prashanth Krishna Reddy, Divya & Kalyan Kalava, Raj Porumalla & Family, Madhav Epuri & Family; Venkat Sanjeev Garu, SAI Temple Ranga Rao & Geetha, Sunil Bobbili & Vandana Pasupuleti, Venkat Bollimunta, Deepthi Naidu & Ravi Kalli, Surekha & Srinivas Miriyala, Lalitha & AppaRao Gopu, Viswanth K, Kranthi Valle, Sunil Bobbili, Venkat M Cousin, Girija & Ravi Puppala, Puneeth Chandu’s family, Ramana Neelam, Sasi Kelam, Ravi Yellishetty, Prasad Kundelu, Prasad Kunapareddy, RamaPrakash Guduri, Janardhan Pannela, Sireesha G, Uma & Sambasiva Rao Meruga, HimaBindu & Suresh Chintalapudi, Vara Prasad Kunderu,  Kranthi & Deepa Valli, Durga S Purushothapu, Madhulatha Aketi, Sowjanya Burri, Sameera Mathi, Chandra polaku & family, Mohan & Sunitha Meda,Sandhya Girida, Anu Ramisetti GARLU – GARLU – GARLU.. !!

PHOTOS 1:) https://goo.gl/photos/gpdouC1eiuiwfC1U9

PHOTOS 2:) 2nd bunch of Pictures below..  https://drive.google.com/folderview?id=0BwCnH_YHhe-cbV9YcTZJZGlxbEk&usp=sharing_eid&ts=57235cf1

Thanks A Bunch to Puneeth Chandu, Narayana Kandula, Ravi Kalli & All Active Volunteers helped us for nice photographs..!..

ప్రత్యేక గౌరవ ధన్యవాదాలతో,

మీ నరేష్ బాబు శ్రీరామ (రీజినల్ వైస్ ప్రెసిడెంట్).
హిమబిందు నరహరిశెట్టి (స్టేట్ కోఆర్డినేటర్) & అట్లాంటా ఆప్త బృందం!!

అట్లాంటా ఆప్త.

Thanks & Regards

Naresh Sreerama

Leave a reply