Matrimonial Telugu FAQ
Matrimonial Telugu FAQ
@apta

రోజూ ఆప్త మేట్రిమోనియల్ కు అనేక ఈమెయిల్స్, ఫొన్లు ద్వారా అందుతున్న ప్రశ్నలకు జవాబులు ఈ క్రింది  “ఫ్రీ ఆక్వ”లో తెలుసుకోండి…..

ఆప్తా మేట్రిమోనీ “ఫ్రీ ఆక్వ” 

ప్ర 1: ఆప్తా మేట్రిమోనీలో మా వివరాలు ఎలా నమోదు చేసుకోవాలి? జ 1: ఆప్తా మేట్రిమోనియల్ లింకు “http://goo.gl/forms/PnXmT4kr7Y” ఉపయోగించి మీ అన్ని వివరాలు నమోదుచేసుకోండి. ఆప్తా మేట్రిమోనియల్ కు నేరుగా పంపిన ధరఖాస్తులు పరిశీలించబడవు.

ప్ర 2: ఆప్తా మేట్రిమోనియల్ లింకు “http://goo.gl/forms/PnXmT4kr7Y”  వుపయోగించి నమోదు చేసుకున్నతరువాత ఎమి చేయాలి? జ 2: ఆప్తా మేట్రిమోనియల్ లింకు ఉపయోగించి నమోదు చేసుకున్నతరువాత మీకు అబ్బాయిలూ / అమ్మాయిల జాబితా వస్తుంది.

ప్ర 3: మా అమ్మయి ఫొటోలు ఆప్తా మేట్రిమోనీ ఫారంతో పాటు  పంపించాలా? జ 3: ఆప్తా మేట్రిమోనీ ఫారంతో పాటు ఏవిధమైన ఫోటోలూ పంపించనవసరంలేదు.  తరువాత జరిగే ఇరు వర్గాలా సంప్రదింపులసమయంలో ఫోటోలు పంచుకొవచ్చు.

ప్ర 4: ఆప్తా మేట్రిమోనియల్ ఫారం నమోదు చేసుకున్న తరువాత   ఏ విధమైన వివరాలు మాకు అందుతాయి?    జ 4: ఆప్తా మేట్రిమోనియల్ ఫారం నమోదు చేసుకున్నా తరువాత మీకు అబ్బాయి/ అమ్మాయి పేర్లూ, ఈమెయిలూ  ఐడీలు,  జన్మ నక్షత్రం, ఎత్తూ, చదువూ, ఉద్యోగ వివరాలతో పాటు ఫొను   నెంబరులు అందుతాయి. అందులోనుండి మీకు సరి అయిన వాటిని ఎంపికచేసుకొని ఫోనుల ద్వారా గానీ ఈమెయిలూ ద్వారా కాని సంప్రదింపులు మొదలు పెట్టవచ్చు. 

ప్ర 5: మా తరుఫున ఆప్తా మేట్రిమోనియల్ వారు సంప్రదింపులూ  / వివరాలూ సేకరణ ఎమయినా జరుపుతారా?       జ 5: లేదు. ఆప్తా మేట్రిమోనియల్ ఏ విధమయిన వివరాల సేకరణ, సంప్రదింపులూ జరుపదు. ఇరువర్గాలూ పరస్పరం సమాచారం పంచుకొని సంప్రదింపులు కొనసాగించాలి. ఆప్తా మేట్రిమోనియల్ కేవలం వారధిగా మాత్రమే వ్యవహరిస్తుంది.

ప్ర 6: ఆప్తా మేట్రిమోనియల్ పంపిన లిస్టులో మాకు సరి అయిన సంబంధం దొరకని పక్షంలో ఏమిజరుగుతుంది? జ 6: ఆప్తా మేట్రిమోనియల్ పంపిన లిస్టులో మీకు సరి అయిన సంబంధం దొరకని పక్షంలో మరొక సరికొత్త లిస్టు పంపిస్తుంది.

ప్ర 7: ఆప్తా మేట్రిమోనియలుకు కమీషన్ లేదా రుసుము ఏదైనా చెల్లించాలా?       జ 7: ఆప్తా మేట్రిమోనియల్ స్వశ్చందంగా జరిపే కార్యక్రమం. ఏ విధమయిన ఫీజు కానీ, కమీషను కానీ వుండదు.  పైగా,  ఆనందాన్ని పంచుకుంటూ ఆప్తా మేట్రిమోనియల్ న్యుస్ లెటెర్లో ప్రచురిస్తుంది కూడా, ఇంకా ఆప్తా మేట్రిమోనియల్ తరపున నూతన దంపతులకు కొన్ని ప్రత్యేక బహుమతులు కూడా అందుకోవచ్చు.     

ప్ర 8: ఆప్తా మేట్రిమోనియలో జాతకచక్రాలు వేసే సౌకర్యం వుందా? జ 8: లేదు.

ప్ర 9: ఆప్తా మేట్రిమోనియల్ నుండి వచే అమ్మాయి / అబ్బయీ వివరాలు అన్ని సరైనవేనని ఎమిటి భరోసా? జ 9: ఆప్తా మేట్రిమోనియల్ పంపించే జాబితా కేవలం ఆప్తాకు అందిన వివరాలు మాత్రమే. అందులో  వున్నవివరాలు సరైనవా లేదా అని విచారించుకోవలసిన బాధ్యత ఇరువర్గాలపై ఆధారపడి వుంది. సంప్రదింపులు చేసుకొని  పూర్తి సమచారం, లోతైన వివరాల సేకరణా, ఇతరత్రా పరిశోధనలూ విచారణలూ చేసి   తెలుసుకొవటము  మీవంతే.  

ప్ర 10: ఆప్తా మేట్రిమోనియలో డైవోర్సు / రెండో పెళ్ళి వారి వివరాలు వుంటాయా?    జ 10: ఆప్తా మేట్రిమోనియలో జాబితాలో కొన్ని డైవోర్సు / రెండో పెళ్ళి వారి వివరాలు కూడా వున్నాయి.

ప్ర 11: ఒకసారి ఫారం నమోదు చేసుకున్న తరువాత ఏమైనా మార్పులు చేయాలంటే ఎలా?              జ 11: మేట్రిమోనియల్ ఫారం నమోదు చేసుకునేటప్పుడే జాగ్రత్త గా చేయాలి. కొన్నికారణాల వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ఆప్తాకు ఈమైయిలు ద్వారా తెలియచేయండి. వెబ్ మాస్టర్ వాటిని మార్పుచేస్తారు. అయితే దీనికి వెబ్ మాస్టర్ అందుబాటును బట్టి సరిచేయటానికి కొన్ని రోజులు పట్టవచ్చు. 

ప్ర 12: ఆప్తా మేట్రిమోనియల్ సంభందించిన ఇతర వివరాల కొరకూ, ప్రశ్నలనూ ఎవరికి పంపించాలి?        జ 12: ఆప్తా మేట్రిమోనియల్ సంభందించిన ప్రశ్నలను “apta.matrimony@gmail.com” లేదా    “eedoo.jodoo@gmail.com” కు కానీ పంపించవచ్చు. ఆయితే కార్యవర్గం అనుకూలతను బట్టి సమాధానం కొరకు   కొంత సమయం పట్టవచ్చు. 

శ్రీరస్తు! శుభమస్తు!! కళ్యాణమస్తు!!!

ఇట్లు

ఆప్త మేట్రిమోనియల్ కమిటీ