ఆప్త ఉచిత మెగా వైద్య శిబిరం – సంగమూడి, కృత్తివెన్ను మండలం, కృష్ణా జిల్లా

ఆప్తులకు నమస్కారం,

ఆప్త మెగా వైద్య శిబిరం

సంగమూడి వైద్య శిబిరానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ చుండూరి మల్లీశ్వరి గారి ఆధ్వర్యంలో భీమవరం మరియు నరసాపురము నుండి వివిధ విభాగాలకు సంబంధించిన ఎనిమిది మందితో కూడిన వైద్య బృందం మరియు మచిలీపట్నంనకు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ప్రేమ్ కుమార్ తోట గారు వారి బృందం రోగులను పరీక్షించి తమ అమూల్యమైన సేవలను అందించారు.

ఈ వైద్య శిబిరానికి మన సుపరిచిత వైద్యులు డాక్టర్ సూర్య రగుతు గారు మరియు వారి కుమారులు చిరంజీవి నీల్ రగుతు గారు ఉచితంగా మందులు సమకూర్చారు.

వైద్య సేవలు అందించిన వైద్యులు:

Dr. Saibabu Chunduri M.S. – General Surgeon

Dr. Malliswari Chunduri M.D., D.G.O. – Gynecologist

Dr. Prem Kumar Thota M.D., D.M. – Cardiologist

Dr. Narasimha Rao Lingam M.S. – Orthopedic

Dr. Devi Krishna Pinisetti D.G.O. – Gynecologist

Dr. Vinay Kumar Yerramsetty M.S. – ENT

Dr. Ravi Uppalapati M.D. – General Medicine

Dr. Teja Yeddula MDS – Dentist

Dr. Pushapajali Kella M.D. – Dermatologist

భీమవరానికి చెందిన OMICS Laboratory వారు( శ్రీ కొమ్ముల మురళీ కృష్ణ, శ్రీ మధు బాబు పులగం) ఉచిత రక్త పరీక్షలు మరియు ECG పరీక్షలు నిర్వహించారు.

ఆప్త సభ్యులు, South east Atlantic region Ex RVP మరియు మచిలీపట్నం పార్లమెంట్ నాయకులు శ్రీ రామ్ బండ్రెడ్డి గారు, మచిలీపట్నంలో మన ఆప్త కార్యక్రమాలకు మద్దతిచ్చి సహకరిస్తున్న ప్రముఖ నాయకులు శ్రీ రామకృష్ణ బండి (RK Group of businesses) గారు అతిథులుగా విచ్చేసి వైద్యులను సత్కరించి వారికి ఆప్త తరపున జ్ఞాపికలను అందించి వైద్యులు చేస్తున్న సేవలను కొనియాడారు.

ఈ వైద్య శిబిరానికి హాజరయ్యి విజయవంతం చేసిన వైద్యుల బృందం, OMICS Laboratory వారికీ, అల్పహారం అందించిన చిరంజీవి అనిరుద్ యాళ్లబండి, ముఖ్యంగా డాక్టర్ సూర్య రగుతు గారికి వారి కుమారులు చిరంజీవి నీల్ రగుతు గారికి వారికి సహకరించిన డాక్టర్ దినేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

అలాగే మొదటి నుంచి మాకు సహకరించిన ఆప్త గౌరవ అధ్యక్షులు శ్రీ ఉదయ్ భాస్కర్ కొట్టే గారికి, కార్యదర్శి శ్రీ రవి ఎలిశెట్టి గారికి, కోశాధికారి శ్రీ సత్య బల్ల గారికి, పూర్వ అధ్యక్షులు మరియు పూర్వ బోర్డు సభ్యులు శ్రీ గోపాల్ గూడపాటి గారికి, పూర్వ బోర్డు సెక్రటరీ శ్రీ రాజేష్ యాళ్లబండి గారికి, శ్రీ శ్రీనివాస్ కటారి గారికి, శ్రీ శ్రీనివాస రావు కూనసాని గారికి, శ్రీ నాగబాబు కూనసాని గారికి, శ్రీ అశోక చక్రవర్తి కూనసాని గారికి, శ్రీ భరత్ కూనసాని గారికి, శ్రీ హనుమాన్ మేళం గారికి, శ్రీ లీల కృష్ణ కటకం గారికి, శ్రీ నాగసాయి కూనసాని గారికి, ఈ శిబిరానికి హాజరయ్యి సేవలను వినియోగించుకున్న వారందరికీ, సంగమూడి గ్రామస్తులకు, పెద్దలకు పేరుపేరునా ధన్యవాదాలు