APTA Matrimonial Telugu FAQs

ఆప్త మేట్రిమోనియల్ – తరచూ అడిగే ప్రశ్నలు

ప్ర 1. ఆప్త మేట్రిమోనియల్ లో నమోదు చేసుకునేందుకు తప్పనిసరిగా ఆప్త రిజిస్టర్డ్ మెంబరు అయి వుండాలా?
జ 1. లేదు. ఆప్త మేట్రిమోనియల్ లో నమోదు చేసుకునేందుకు ఆప్త మెంబరు అయి వుండనవసరంలేదు కానీ, ఎవరైనా తెలిసిన ఒక రిజిస్టర్డ్ మెంబరు వివరాలు తప్పనిసరిగా కావాలి.

ప్ర 2: ఆప్త ఈమెయిల్ ఐడీకి మా అమ్మాయి వివరాలూ / బయోడేటా పంపించాలా? ఆప్త మేట్రిమోనీలో మా వివరాలు ఎలా నమోదు చేసుకోవాలి?
జ 2: ఆప్త మేట్రిమోనియల్ ఈమెయిలుకు నేరుగా పంపిన దరఖాస్తులు పరిశీలించబడవు. ఆప్త మేట్రిమోనియల్ లింకు https://forms.gle/HJA1Bu8gXRmxKyae7 ను ఉపయోగించి మీ వివరాలు నమోదుచేసుకోండి.

ప్ర 3: ఆప్త మేట్రిమోనియల్ ఫారం లింకు వుపయోగించి నమోదు చేసుకున్నతరువాత ఎమి చేయాలి, ఏ విధమైన వివరాలు మాకు అందుతాయి?
జ 3: ఆప్త మేట్రిమోనియల్ ఫారం నమోదు చేసుకున్న తరువాత మీకు అబ్బాయి/ అమ్మాయి పేర్లూ, జన్మ నక్షత్రం, ఎత్తూ, చాయ, చదువూ, సంపాధనా, ఉద్యోగ వివరాలతో పాటు ఫొను నెంబరులు, ఈమెయి ల్ ఐడీలతో కూడిన జాబితా మీరు నమోదు చేసుకున్న ఈమెయిలుకు అందుతాయి. అందులోనుండి మీకు సరి అయిన వాటిని ఎంపికచేసుకొని ఫోనుల ద్వారా గానీ ఈమెయిలు ద్వారా కాని సంప్రదింపులు మొదలు పె ట్టు కో వచ్చు.

ప్ర 4: మా అమ్మయి ఫొటోలు ఆప్త మేట్రిమోనీ ఫారంతో పాటు పంపించాలా?
జ 4: ఫారంతో పాటు నేరుగా ఫొటోలు అప్ లోడ్ చేసేందుకు ఎటువంటి సౌకర్యం లేదు. ఇరు వర్గాల వారు సంప్రదింపుల సమయంలో ఫొటోలు పంచుకోవచ్చు. ఇలా పంచుకునే సమయంలో అబ్బాయి ఫొటోలే ముందుగా అమ్మాయిలకు పంపాలని ఆప్త సిఫార్స్ చేస్తుంది. (ప్ర 6/ జ 6 కూడా చూడండి).

ప్ర 5: మా అమ్మాయి వివరాలు ఇవ్వటం మాకు ఇష్టంలేదు, అబ్బాయిల జాబితా మాకు పంపగలరా?
జ 5: ఆలా పంపించటం సాధ్యంకాదు. మీ అమ్మాయి పూర్తి వివరాలు నమోదు చేసిన వెంటనే అబ్బాయిల వివరాల జాబితా అందుతుంది. అలా చేయటం వలన రెండు విధాలా లాభం వుంటుంది, అబ్బాయిల జాబితా మీకు వస్తుంది కనుక లిస్టులో నచ్చిన వారిని మీరే నేరుగా సంప్రదించవచ్చు, అలాగే మీ అమ్మాయి వివరాలు అబ్బాయిలకూ వెళుతుంది కనుక వారే మిమ్ములను సంప్రదిస్తారు.

ప్ర 6: మా తరుఫున ఆప్త మేట్రిమోనియల్ వారు సంప్రదింపులూ / వివరాల సేకరణ ఎమయినా జరుపుతారా?
జ 6: లేదు. ఆప్త మేట్రిమోనియల్ ఏ విధమయిన వివరాల సేకరణ, సంప్రదింపులూ జరుపదు. ఫోను ద్వారా గానీ ఈమెయిలు ద్వారా గానీ పరస్పరం సమాచారం పంచుకొని సంప్రదింపులు కొనసాగించాలి. ఆప్త మేట్రిమోనియల్ కేవలం వారధిగా మాత్రమే వ్యవహరిస్తుంది.

ప్ర 7: ఆప్త మేట్రిమోనియల్ పంపిన లిస్టులో మాకు సరి అయిన సంబంధం దొరకని పక్షంలో ఏమిజరుగుతుంది?
జ 7: ఆప్త మేట్రిమోనియల్ పంపిన లిస్టులో మీకు సరి అయిన సంబంధం దొరకని పక్షంలో సుమారు ఆరు నెలల ఆగిన తరువాత “apta.matrimony@gmail.com” కు తెలియజెస్తే అప్పటివరకూ నమోదుచేసుకున్న వారి సరికొత్త జాబితా పంపిస్తుంది.

ప్ర 8: ఆప్త మేట్రిమోనియలుకు కమీషన్ లేదా రుసుము ఏదైనా చెల్లించాలా?
జ 8: ఆప్త మేట్రిమోనియల్ స్వచ్చందంగా జరిపే కార్యక్రమం. ఏ విధమయిన ఫీజు కానీ, కమీషను కానీ వుండదు. పైగా, ఆనందాన్ని పంచుకుంటూ ఆప్త మేట్రిమోనియల్ “ఆప్త వాణి “ న్యుస్ లెటెర్లో ప్రచురిస్తుంది కూడా.

ప్ర 9: ఆప్త మేట్రిమోనియల్ లో జాతకచక్రాలు వేసే సౌకర్యం వుందా?
జ 9: లేదు. ఆప్త మేట్రిమోనియల్ లో జాతకచక్రాలు వేసే సౌకర్యం లేదు.

ప్ర 10: ఆప్త మేట్రిమోనియల్ నుండి వచ్చే అమ్మా యీ / అబ్బయీ వివరాలు వాస్తవాధారాలున్నవేనని ఎమిటి భరోసా?
జ 10: ఆప్త మేట్రిమోనియల్ లింకు అందరికీ అందుబాటులో వుంటుంది కనుక, పంపించే జాబితా కేవలం ఆప్తకు అందిన వివరాలు మాత్రమే. అందులో వున్నవివరాలు సరైనవా లేదా అని విచారించుకోవలసిన బాధ్యత ఇరువర్గాలపై ఆధారపడి వుంది. సంప్రదింపులు చేసుకొని పూర్తి సమచారం, విచారణలు చేసి తెలుసుకోవటము మీవంతే.

ప్ర 11: ఆప్త మేట్రిమోనియలో డైవోర్సు / చట్టబద్దమయిన రెండో పెళ్ళి వారి వివరాలు వుంటాయా?
జ 11: ఆప్త మేట్రిమోనియలో జాబితాలో డైవోర్సు / చట్టబద్దమయిన రెండో పెళ్ళి వారి వివరాలు రిజిస్టర్ చేసుకున్నట్లైతే, వుండే అవకాశం వుంది.

ప్ర 12: ఒకసారి ఫారం నమోదు చేసుకున్న తరువాత ఏమైనా మార్పులు లేదా పూర్తిగా తొలగించాలనుకొంటే ఎలా?
జ 12: ఫారం నమోదు చేసుకున్న వెంటనే ఆ యూ.ఆర్.ఎల్ అడ్రస్ ను కాపీ చేసుకుని సేవ్ చేసుకోవాలి. ఆ లింకును వుపయోగించి మీకు కావలసిన మార్పులు చేసుకోవచ్చు. ఒకవేళ అలాచేయ కుండా, గుర్తులేని పక్షంలో, చేయదలచిన మార్పుల వివరాలతో పాటు ఫారంలో నమోదు చెసిన ఫస్ట్ నేం, లాస్ట్ నేం, ఈమెయిల్ ఇడీ, ఫోన్ నెంబర్ లను apta.matrimony@gmail.com కు ఈమెయిల్ చేయండి. ఆయితే కార్యవర్గం అనుకూలతను బట్టి మార్పుచేయుటకు కొంత సమయం పట్టవచ్చు.

ప్ర 13: ఆప్త మేట్రిమోనియల్ సంబంధించిన ఇతర వివరాల కొరకూ, ప్రశ్నలనూ ఎవరికి పంపించాలి?
జ 13: ఆప్త మేట్రిమోనియల్ సంబంధించిన ప్రశ్నలను apta.matrimony@gmail.com కు పంపించవచ్చు. ఆయితే కార్యవర్గం అనుకూలతను బట్టి సమాధానం కొరకు కొంత సమయం పట్టవచ్చు.

ప్ర 14: మేము ఇండియాలో వుంటాము ఆప్త మేట్రిమోనీ ఫారం ద్వారా మా వివరాలు నమోదు చేసుకోవచ్చా?
జ 14: మీరు ఏ దేశంలో వున్నా నమోదు చేసుకోవచ్చు, అయితే మీకు తెలిసిన ఒక అప్త మెంబర్ పేరును ఫారంలో తెలపాలి. (ప్ర1 / జ1 కూడా చూడండి)

శ్రీరస్తు! శుభమస్తు!! కళ్యాణమస్తు!!!
ఆప్త మేట్రిమోనియల్ సర్వీసెస్

తరచూ అడిగే  ప్రశ్నలు ఆంగ్లంలో | ఆప్త  మేట్రిమొనీ హోం

WordPress Lightbox Plugin
Close Bitnami banner
Bitnami