అమెరికాలో ఉంటున్న స్టూడెంట్లకు H1 వీసా వివరాలు కావాలన్నా లేదా H1, L1 తదితర వీసాల మీద ఉన్నవారికి Green Card పొందే విషయ సేకరణ కూడా ఆప్త ద్వారా చాలా సుసాధ్యం. అలాగే అమెరికాలో ఉంటున్న ఆప్తులకు Careers & Immigration విషయాలలో కావలసిన సహాయ సహకారాలను అందిస్తున్నది.
ముఖ్యంగా ఆప్త సభ్యులలో ఎవరికైనా దురదృష్టకరమైన సంఘటనలు (ఉదాహరణకు కారు ప్రమాదాలు, ఆకస్మిక మరణాలు, కుటుంబ అత్యవసర పరిస్థితులు కావచ్చు) సంభవించినా , ఆప్త సంస్థ వారి కుటుంబ సభ్యుల వెన్నంటే ఉండి కావలసిన నైతిక మరియు ఆర్థిక సహాయాన్ని అత్యంత త్వరితగతిన అందిస్తుంది.
2009 లో వర్జీనియాలోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సలాది మోహన్ అకాల దుర్మరణం పొందినపుడు ఆప్తులందరుా కలసి పది వేల డాలర్లు విరాళాలను రెండు రోజులలో సేకరించి అతని కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలబడ్డారు.