నాదేశం ఎటుపోతోందన్న అధైర్యం… అస్సలు లేదు నాకు ఎందుకంటే..ఒక్క అల్లూరి నేలకూలితే వేల నిప్పుకణాలు నింగినుంచి పుట్టుకొస్తాయన్న అల్లూరి వారసులం మనం
వేలమంది దేశద్రోహుల పీచమణచటానికి..
సరైన దేశభక్తుడు ఒక్కడు చాలు
అలాంటి దేశభక్తుల్ని ఎందరినో కన్నతల్లి నా భరతమాత
ఆయుధం లేదే అని అధైర్యమే ఎరుగని….
ఉన్న ఒక్క ఊపిరినే ఉప్పెనగా మార్చుకుని..
ఆత్మవిశ్వాసాన్నే ఆయుధం గా చేతబూని…
శత్రువుల గుండెల్లో గునపాలు దించిన
“”సంతోష్”” సేనా వాహిని సుపుత్రులం మనం
శత్రువులచేతచిక్కి చిరుతలా చిద్విలాసంతో
బయటకొచ్చిన…అభినందన్ అన్నదమ్ములం మనం
లెక్కకు తెలిసినవారు…కొంతమందే!
లెక్కలు సరిచేసినవారు ఎంతమందో!!
విశ్వవిజేత అలెగ్జాండర్ విశ్వరూపం చాలించింది ఈ భారత భూమిని తాకినప్పుడే…
రవి అస్తమించని సామ్రాజ్యం కొమ్ములు విరిగింది ఈ భారత భూమిని ఏలినప్పుడే…
అందుకే…నాదేశం చారిత్రక దేశం
నా భరతఖండం అఖండం
ఈ భూమి తపోభూమి
నా భరతమాత వీరమాత
ఈ భూమిపై…స్వేచ్ఛా వాయువులు అనంతం
సృష్టి వున్నంతకాలం …ఈ భూమి అఖండం.
Let’s celebrate the heroes who are working hard to protect our freedom. Stay home and Stay safe.
జైహింద్✊✊✊