APTA Free Mega Medical Camp at Adilabad Dt, Telangana

ఆదిలాబాద్ లో ఆప్త (APTA) నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరం అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) అధ్వర్యంలో మరియు జనమైత్రి పోలిస్ సహకారంతో జాతిపిత మహత్మా గాంధీ జయంతి సందర్బంగా తెలంగాణా రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా లో ఖానాపూర్ మండల గిరిజన మారుమూల ప్రాంతమైన రాజురా గ్రామమునందు, జిల్లా పరిషత్తు హై స్కూల్ ఆవరణ లో అక్టోబర్ నెల 2వ తేది ఆదివారం నాడు ఉదయం 8 గం!! ల నుండి సాయుంత్రం 4 గం!! ల వరకు “ఆప్త వారి ఉచిత మెగా వైద్య శిబిరం* నిర్వహించ బడుతుంది. తమ సంస్థ నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు మరియు స్థానికులైన డా. వేణు గోపాల్ గారు, డా. కృష్ణంరాజు గారు, డా. రామకృష్ణ గారి తో సహా 20 మంది వైద్యులు మరియు వారి వైద్య బృందంచే అన్నిరకాల వ్యాధులకు వైద్య సేవలు మరియు మందులు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది అని, అంతేకాకుండా ప్రతి గ్రామానికి వాహన సదుపాయంతో పాటుగా ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నట్లుగా ఆప్త సంస్థ అధ్యక్షులు శ్రీ గోపాల కృష్ణ గూడపాటి వివరించారు. ఇంత మారు మూల ప్రాంతం లో ఇంత పెద్ద ఎత్తున వైద్య శిబిరాన్ని నిర్వహంచటం ఇదే మొదటసారి అని, ఈ ఒక్క క్యాంపు ద్వారా 2000 మంది కి పైగా రోగులకి ఉచిత వైద్య సహాయం అందించటానికి అన్ని రకాలా ఏర్పాట్లు చేస్తున్నట్లు , ఒక ప్రశ్న కు సమాధానంగా శ్రీ గోపాల కృష్ణ గూడపాటి తెలిపారు. రెండు తెలుగు రాష్టాలలో ఇలాంటి మెడికల్ క్యాంప్స్ మరెన్నో ఆప్త నిర్వహించబోతున్నట్టు తెలియచేశారు. ఈ భారీ వైద్య శిబిరానికి ఆప్త మెడికల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (AMAP) చైర్ డా. కుమార్ కొత్తపల్లి గారు ప్రణాళిక రచించగా , వైస్ చైర్ డా. సూర్య రగుతూ గారు రోగులకు కావలిసిన మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రాంత వాసి , ప్రవాస భారతీయుడు అయిన శ్రీ జనార్దన్ పన్నెల గారి ఆధ్వర్యం లో నడపబడుతున్న శాంతి నికేతన్ సంస్థ ఈ వైద్య శిబిరానికి కావలిసిన అన్ని రకాల సహకారాలను అందిస్తుంది. స్థానికులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని *ఆప్త వారి ఉచిత మెగా వైద్య శిబిరం* ను విజయవంతం చేయవలసిందిగా ఆప్త సంస్థ ఉపాధ్యక్షలు శ్రీ జిడుగు సుబ్రహ్మణ్యం పత్రికా ముఖంగా ఆదిలాబాద్ జిల్లా వాసులకు విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు ఆప్త సభ్యులని కాని , CI శ్రీ నరేష్ గారిని కాని , శాంతినికేతన్ డైరెక్టర్ గారిని కాని సంప్రదించి తెలుసుకోవలసింది గా అయన కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీమతి రేఖాశ్యామ్ నాయక్ వస్తున్నారు. అమెరికా లో వుండే అనేక తెలుగు సంస్థలలో ఏ సంస్థ కూడా ఇంత వరకు ఈ మారు మూల వెనుక బడిన ప్రాంతంలో మెడికల్ క్యాంపు నిర్వహించిన దాఖలా లేదు. తొలి సారిగా భారీ స్థాయి లో ఆప్త (APTA ) సంస్థ ఈ ప్రాంతం లో మెడికల్ క్యాంపు నిర్వహించటం గమనార్హం.

]]>