APTA Supported Chiranjeevi Oxygen Bank

ఈ కోవిడ్ కష్టకాలం లో లక్షలాది ప్రజానీకం అనేక విపత్కర పరిస్థితులను ఎదురుకుంటున్న ఈ సమయంలో నేను సైతం అంటూ ముందుకి వచ్చిన మన ఆపద్బాంధవుడు మెగాస్టార్ చిరంజీవి గారు “చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్” ను నెలకొల్పి సేవను అందించగా, మన ఆప్త తరువున ఈ సంజీవినికీ అండగా రూ.35 లక్షలు అందచేసాము. ఈ ప్రయత్నంలో భాగస్వాములను మరియు దాతలను పేరు పేరు న చిరంజీవి గారు అభినందించారు.

చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు కు Rs. 35 లక్షలను APTA అధ్యక్షుడు శ్రీ JJV Subrahmanyam గారు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి స్వయంగా అందజేసారు.

అమెరికాలో నే కాకుండా మన దేశంలో పలు రంగాల్లో ముందు ఉండి సహాయ సహాకారాలు అందిస్తున్న మన ఆప్తులని చిరంజీవి గారు ప్రశంసించారు. తెలుగు వారు వృత్తి రీత్యా అమెరికా వెళ్లినా జన్మభూమిని అస్సలు మర్చిపోకుండా వీలైనంతగా ఆపన్న హస్తం అందజేస్తునందుకు శ్రీ చిరంజీవి గారు మనస్ఫూర్తిగా ఆప్తా లో ఉన్న ప్రతిఒక్కరిని అభినందించారు. ఇండియా లో కరోనా బాధితులకు APTA స్వయంగా భారీగా సహాయ సహకారాలు అందజేస్తునందుకు అభినందించారు.

Vijay Repalle
APTA Mega Blood Drive Chair