Happy Ugadi Greeting
Happy Ugadi Greeting
March 17, 2016 Comments Off on Happy Ugadi Greeting News @apta

ఆప్తా కుటుంబ సభ్యులందరికీ, శ్రీ దుర్ముఖి నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఉత్తర అమెరికా లోని ప్రతి రాష్ట్రం లోను సభ్యుల సంఖ్య గణనీయంగా అభివృద్ధి చెందుతూ, ఆప్తుల కుటుంబ బంధాలు మరింత బలపడుతూ, మరింతమంది ఆప్తులు క్రొత్త వ్యాపార సంస్థలకు పునాదులు వేసుకుని, ఒకరికొకరు మరియు ఆప్తా సంస్థ కు సహాయ సహకారాలు అందిస్తూ, ఆప్తా  సంస్థ చేపట్టిన అన్ని కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ పాలు పంచుకుంటూ, ప్రగతి పథంలో ఆప్తా మరింత అత్యున్నత స్థాయికి ఎదగటానికి దోహదపడాలని, ఈ సాధనలొ భగవంతుడు అందరికి తగిన ఆరోగ్యాన్ని, భుక్తిని, సంకల్పాన్ని, శక్తి యుక్తులని,  ప్రసాదించాలని కోరుకుంటూ..
శుభాభినందనలతో,
విశ్వనాథం (విసు) బొక్కిసం
చైర్, అప్తా బోర్డ్

దుర్ముఖి నామ సంవత్సరంలో అప్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటు అప్తులందరికి యుగాది శుభాకాంక్షలు. దుర్ముఖి నామ సంవత్సరం  ఆప్త నామ సంవత్సరం అవ్వాలి. మనం తలపెట్టిన కార్యక్రమాలన్నీవిజయవంతం గా జరగాలి. ఈ సంవత్సరం ఉగాది వేడుకలు చేసుకొనే అన్ని ప్రదేశాలలో అప్తులందరూ  పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేస్తారు అని ఆశిస్తున్నాం.

Thanks 
Gopala K Gudapati,
President APTA